Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇంటర్​, డిగ్రీతో తెలంగాణ కోర్టుల్లో 324 ఉద్యోగాలు

ఇంటర్​, డిగ్రీతో తెలంగాణ కోర్టుల్లో 324 ఉద్యోగాలు

తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న 324 పోస్టుల భర్తీకి హైకోర్టు తాజా నోటిఫికేషన్​ విడుదల చేసింది. 144 టైపిస్ట్ ఉద్యోగాలు, 89 కాపీయిస్ట్ ఉద్యోగాలు, 91 స్టెనోగ్రాఫర్​ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదలైంది. .

Advertisement

మొత్తం పోస్టులు 324

కాపీయిస్ట్ పోస్టులు 89
టైపిస్ట్ ఉద్యోగాలు144
స్టెనోగ్రాఫర్ పోస్టులు91

టైపిస్ట్ ఉద్యోగాలు

టైపిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్​ ద్వారా మొత్తం 144 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ల ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15.

ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్​ లో హయ్యర్​ సర్టిఫికెట్​ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్​లైన్​ పరీక్షతో పాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష జులైలో నిర్వహిస్తారు. తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,280 నుంచి రూ.72,850 వరకు జీతం ఉంటుంది.

పూర్తి వివరాలు అఫిషియల్​ వెబ్​సైట్​ https://tshc.gov.in లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఈ పీడీఎఫ్​లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

కాపీయిస్ట్ పోస్టులు

ఇంటర్​ పాసై, టైపింగ్ లో హయ్యర్ లేదా లోయర్​ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ల నమోదుకు చివరి తేదీ జూన్​ 15. ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జులైలో ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,900 నుంచి రూ.69,150 వరకు జీతం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలు అఫిషియల్​ వెబ్​సైట్​ https://tshc.gov.in లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఈ పీడీఎఫ్​లో అందుబాటులో ఉన్నాయి.

స్టెనోగ్రాఫర్ పోస్టులు

డిగ్రీ పూర్తి చేసిన స్టెనోగ్రఫీ సర్టిఫికెట్​ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీతో పాటు.. టైపింగ్ లో హయ్యర్ లేదా లోయర్​ స్టెనో గ్రఫీ సర్టిఫికేట్ ఉండాలి. తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 15. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,810 నుంచి రూ.96,890 వరకు జీతం చెల్లిస్తారు. వీటికి ఆన్ లైన్ విధానంలో జులైలో పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

పూర్తి వివరాలు అఫిషియల్​ వెబ్​సైట్​ https://tshc.gov.in లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఈ పీడీఎఫ్​లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన లింక్స్

  1. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!