HomeLATESTఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్స్‌ కోర్సులు

ఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్స్‌ కోర్సులు

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) 2022 విద్యాసంవత్సరానికి ఎంటెక్‌/ ఎం.డిజైన్‌/ ఎంఏ మాస్టర్స్‌ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 3 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

ఎంటెక్‌: ఎంటెక్​ కోర్సులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్, కెమికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్స్​ ఉన్నాయి. బీటెక్​ చేసి, వాలిడ్ గేట్​ స్కోర్‌ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు.

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్/ ఆర్కిటెక్చర్‌/ డిజైన్‌/ ఇంటీరియర్‌ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (డీఏటీ), ఇంటర్వ్యూ, పోర్ట్‌ఫోలియో సమీక్ష (రివ్యూ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎంఏ): ఇందులో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, హెల్త్‌, జెండర్‌ అండ్‌ సొసైటీ అనే విభాగాలు ఉంటాయి. కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్​ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.iith.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!