భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాస్కోడిగామా (గోవా)లోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్ తదితర పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 253 పోస్టులను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు.
పోస్టులు: అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ట్రెయినీ వెల్డర్లు, యార్డ్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్లు, అన్‌స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 36 ఏళ్లు మించకూడదు. పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.10,100 నుంచి రూ.70,000 వరకు చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీజీఎం, హెచ్ఆర్ విభాగం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడాగామా, గోవా-403802 అనే అడ్రస్‌కు డిటేయిల్స్ పంపాలి. పూర్తి సమాచారం కోసం www.goashipyard.in వెబ్సైట్ సంప్రదించాలి.