HomeLATESTఉగాది కానుకగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌

ఉగాది కానుకగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌


503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకోసం టీఎస్‌పీఎస్సీ ఉగాది కానుకగా నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం పోస్టుల్లో 19 శాఖలకు చెందినవి ఉన్నట్టుగా తెలుస్తున్నది.పోస్టుల భర్తీకి ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ అప్రూవల్​ ఇవ్వడంతో.. నోటిఫికేషన్లపై ఆయా రిక్రూట్​మెంట్​ బోర్డులు కసరత్తు మొదలుపెట్టాయి. ఉగాది రోజున లేదంటే అంతకంటే ముందే నోటిఫికేషన్స్​ ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నాయి. గ్రూప్​ 1లో 503 పోస్టులకు సర్కార్​ తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ)కి అనుమతించింది. దీంతో డిపార్ట్​మెంట్ల వారీగా పోస్టుల వివరాలు, రోస్టర్​, సర్వీస్​ రూల్స్​, ఇతరత్రా అంశాలపై టీఎస్​పీఎస్సీ ఏయే డిపార్ట్​మెంట్​ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానిపై అన్ని డిపార్ట్​మెంట్లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​ నుంచి మున్సిపల్​ కమిషనర్ల పోస్టుల భర్తీకి ఆఫీసర్లు ఇండెంట్​ ఇచ్చారు. ఇక పోలీసు డిపార్ట్​మెంట్​లో డీఎస్పీ, కమర్షియల్​ టాక్స్​ ​, ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్​మెంట్ల నుంచి కూడా పోస్టుల భర్తీపై క్లియరెన్స్​ వచ్చింది. మిగిలిన శాఖల నుంచి కూడా ఈ నెల 28,29 తేదీల్లో పూర్తి వివరాలు ఇవ్వనున్నట్లు చెప్పాయని టీఎస్​పీఎస్సీకి చెందిన ఉన్నతాధికారి తెలిపారు. లీగల్​ ఓపినియన్​ తీసుకుని ఆ వెంటనే నోటిఫికేషన్​ ఇచ్చేలా ప్లాన్​ చేశారు

Advertisement

పోలీస్​ పోస్టుల భర్తీకి క్లియరెన్స్​

హెల్త్​, మెడికల్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫెర్​ డిపార్ట్​మెంట్​లో 2662 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్​పీఎస్సీకి రిపోర్ట్​​ అందింది. పోలీసు రిక్రూట్​మెంట్​ బోర్డు కూడా ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి క్లియరెన్స్​ తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా రెడీ చేసుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మెడికల్​ అండ్​ హెల్త్​ సర్వీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ద్వారా 10,028 పోస్టుల భర్తీ నోటిఫికేషన్​పై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.

కొత్త స్థానికత వర్తింపు ఇలా..

Advertisement

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏళ్లు (అంటే 4,5,6,7 తరగతులు) ఏ జిల్లాలో చదివితే వారు ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణిస్తారు. వేర్వేరు జిల్లాల్లో చదువులు కొనసాగించిన వారి విషయంలో 4,5, 6,7 తరగతుల్లో 6,7వ తరగతులు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలోనే స్థానికులుగా పరిగణనలోకి తీసుకొంటారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!