ఐడీబీఐ 600 అసిస్టెంట్ మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (6 నెలలు తరగతి పాఠాలు, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్) పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్షన్లు జరుగుతాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 20న ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో చేరుస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.