దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ- 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకుల వారీగా ఖాళీలు: మొత్తం 6432 ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 535, కెనరా బ్యాంక్లో 2500, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 500, పంజాబ్ సింధ్ బ్యాంక్లో 253, యూకో బ్యాంక్ లో 550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2094 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 1 ఆగస్టు 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2 నుంచి 22 వరకు అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్లో నిర్వహించనున్నారు. రిజల్ట్స్ నవంబర్లో విడుదల చేస్తారు. మెయిన్స్ పరీక్ష నవంబర్లో నిర్వహించి డిసెంబర్లో ఫలితాలు రిలీజ్ చేస్తారు. అందులో ఎంపికైన అభ్యర్థులకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఫలితాలు ఏప్రిల్ 2023లో వెల్లడిస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో చూసుకోవాలి.