టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) TSTET అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆగస్ట్ 16వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు ఉంది. తుది గడువు వరకు వెయిట్ చేయకుండా అభ్యర్థులు వెంటనే అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు త్వరపడకపోతే.. అప్లై చేయకుండా ఆలస్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధానంగా మీరు ఎంచుకున్న సెంటర్లలో పరీక్ష రాసే అవకాశం చేజారే ప్రమాదముంటుంది. అందుకే అభ్యర్థులు వీలైనంత తొందరగా టెట్ అప్లికేషన్లు నమోదు చేసుకోవటం బెటర్.
లేట్‌గా అప్లై చేస్తే మీ సొంత జిల్లాలో సెంటర్లు నిండిపోయి పక్క జిల్లాలు లేదా హైదరాబాద్‌లో సెంటర్ కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేయడం మేలని గత ఏడాది టెట్ రాసిన అభ్యర్థులు తమకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు చివరి సమయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తి వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నింపే విషయంలో ఏమైనా సందేహాలుంటే టెక్నికల్ సమస్యలు ఉంటే.. 040-23120340, 040- 23120433 నంబర్లను సంప్రదించవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్
అభ్యర్థులు https://tstet.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి ముందుగా ఫీజు చెల్లించి తర్వాత అప్లికేషన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు లేటెస్ట్ ఫొటో గ్రాఫ్ స్కానింగ్ ఇమేజ్, సిగ్నేచర్ స్కాన్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీరు ఫోన్ నంబర్ ఎవరిదో కాకుండా మీకు అందుబాటులో ఉండేది ఎంట్రీ చేస్తే టెట్ సంబంధించి మెసేజ్‌లను ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోవచ్చు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేస్తే ప్రిపరేషన్ టైమ్‌లో ఎలాంటి ఆందోళన ఉండదు. టెన్త్ మెమోలో ఉన్న విధంగా పేరు, ఇతర వివరాలు అప్లోడ్ చేయాలి.
Step 1: అభ్యర్థులు మొదటగా http://tstet.cgg.gov.in/ ఓపెన్ చేసి పేపర్–1 లేదా పేపర్–2 ఎవరైనా రూ. 400 అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
Step 2: ఫీజు చెల్లించేందుకు అభ్యర్థి పేరు, పుట్టినతేది, మొబైల్ నం. , తెలంగాణ రాష్ట్రానికి చెందినవారా కాదా? అనేది ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే బిల్‌డెస్క్ ఓపెన్ అవుతుంది. తర్వాత, డెబిట్, క్రెడిట్,నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
Step3: ఫీజు చెల్లించిన అనంతరం అభ్యర్థులకు జర్నల్ నంబర్ కేటాయించబడుతుంది. ఈ నంబర్ ను అప్లికేషన్ ఫామ్ నింపడానికి తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
Step 4: ఫీజు చెల్లింపు సంబంధించిన జర్నల్ నంబర్ , పుట్టిన తేది, ఫీజు చెల్లించిన తేది వివరాలు నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
Step 5: అప్లికేషన్ ఫారం ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేయాలి. .
Step 6: తర్వాత Save&Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 7: తర్వాత Paper and Qualification విభాగంలో కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. తర్వాత Save & Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 8: అనంతరం టెన్త్ క్లాస్, ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి.
Step 9: తర్వాత “Save & Preview” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 10: ప్రివ్యూలో వివరాలను సరిచూసుకుని సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 11: తర్వాత క్యాండిడేట్ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ మీ రిజిస్టర్డ్ నంబర్ కు SMS ద్వారా వస్తుంది.
Step 12: అనంతరం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని అభ్యర్థి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చేంత వరకు భద్రపరుచుకోవాలి.