తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో వివిధ ఉద్యోగ నియామకాల ఫైనల్ ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టులను ప్రకటించింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ బోర్డు గతేడాది ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు. గతేడాది ఆగస్టులో నెలరోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. తాజాగా ఫలితాలు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనంతరం తుది ఎంపిక జాబితాను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు అందజేయనున్నారు.