HomeLATESTమరో రెండు రోజుల ఉత్కంఠ.. గ్రూప్​ 2 వాయిదా పై హైకోర్టు తీర్పే కీలకం

మరో రెండు రోజుల ఉత్కంఠ.. గ్రూప్​ 2 వాయిదా పై హైకోర్టు తీర్పే కీలకం

గ్రూప్ 2 పరీక్ష (TSPSC GROUP 2) వాయిదా పడుతుందా.. లేదా.. అనే ఉత్కంఠ కొనసాగుతోంది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్​పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గ్రూప్ 2 వాయిదా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ టీఎస్​పీఎస్​సీకి హైకోర్టు సోమవారం వరకు గడువు ఇచ్చింది. ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు వివిద రకాల 21 పోటీ పరీక్షలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. అందులో ఈ నెల 29, 30 న గ్రూప్ 2 పరీక్ష కూడా నిర్వహిస్తుండటంతో పరీక్ష రాయడం అభ్యర్థులకు ఇబ్బందిగా మారిందని పిటిషన్​లో ప్రస్తావించిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరారు.

Advertisement
FILE PHOTO (GROUP 2 ASPIRANTS PROTEST)

గ్రూప్ 2 పరీక్షకు దాదాపు 5.50 లక్షలు మంది అప్లై చేసుకున్నారని.. అందులో 90 శాతం మంది పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్​ 2 పరీక్షకు 5.5 లక్షలు మంది అప్లై చేసుకున్నారని, గురుకుల్ పరీక్షల కు కేవలం 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని టీఎస్​పీఎస్​సీ తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని, 1535 ఎగ్జామ్​ సెంటర్ లలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే పరీక్షలు జరిగే స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. కేవలం 150 మంది మాత్రమే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్​ వేశారని.. సోమవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని టీఎస్​పీఎస్​సీ అడ్వకేట్​ హైకోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం సోమవారం గ్రూప్ 2 పరీక్ష పై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు టీఎస్​పీఎస్​సీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

దీంతో టీఎస్​పీఎస్​సీ సోమవారం ఈనెల 14వ తేదీలోగా తీసుకునే నిర్ణయం గ్రూప్​ 2 కేసులో కీలకంగా మారనుంది. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయినందున గ్రూప్​ 2 వాయిదా వేయటం సరైంది కాదని, ఒక్కసారి వాయిదా పడితే.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పట్లో మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుందా.. లేదా అనే డోలాయమాన పరిస్థితి ఉత్పన్నమవుతుందని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముందని విశ్లేషిస్తున్నారు. గ్రూప్​ 2 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 70 శాతం మందికి బీఈడీ లేదని.. వీరెవరూ గురుకుల పరీక్షలకు అర్హులు కానే కారని టీఎస్​పీఎస్​సీ లెక్కలు తీసింది. మిగిలిన 30 శాతం మంది అభ్యర్థులందరూ గురుకుల్​ పరీక్షలు రాసే అవకాశం లేదని కొట్టి పారేస్తున్నారు. గురుకుల్​ పరీక్షలన్నీ ఆగస్ట్ 23వ తేదీతో ముగిసిపోతాయని, ఆ తర్వాత వారం రోజులకు జరిగే గ్రూప్​ 2 పరీక్ష వాయిదా వేయాలా.. వద్దా.. అనేది మరోసారి తుది సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో హైకోర్టుకు సోమవారం నాడు టీఎస్​పీఎస్​సీ సమర్పించే నివేదిక కీలకంగా మారనుంది. అప్పటికీ గ్రూప్​ 2 పరీక్ష యథాతథంగా షెడ్యూల్​ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్​పీఎసీసీ మొగ్గు చూపితే.. హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపై గ్రూప్​ 2 భవితవ్యం ఆధారపడనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!