గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) – 2022 ఆన్సర్ కీ విడుదలైంది. ఐఐటీ ఖరగ్‌పూర్ కీ విడుదలపై ప్రకటన విడుదల చేసింది. గేట్ ఎగ్జామ్ను ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ రిలీజ్ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://gate.iitkgp.ac.in/ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25లోపు సవాల్ చేయడానికి ఐఐటీ ఖరగ్‌పూర్ అవకాశం కల్పించింది. అభ్యర్థి లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ. 500 ఫీజు చెల్లించాలి. ఫైనల్ రిజల్ట్స్ మార్చి 17 న విడుదల కానున్నాయి.
గేట్ – 2022 ఆన్సర్ కీ రిలీజ్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS