బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. తెలంగాణ లో మొత్తం 16 బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. వీటిలో కోచింగ్ తీసుకునేందుకు ఈనెల 16 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఒక్కో స్టడీ సర్కిల్ లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నారు. యాభై వేల మందికి నేరుగా, మరో యాభై వేల మందికి ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వనుంది. గ్రూప్ 1 , గ్రూపు 2 , టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు నెలనెలా స్టైఫండ్ ఇవ్వనుంది. ఇందుకోసం దాదాపు 50 కోట్లు ఖర్చు అవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు నెలకు ₹5వేల చొప్పున 6నెలలు, గూప్2 అభ్యర్థులకు నెలకు ₹2వేల చొప్పున ౩ నెలలు, ఎస్ఐ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ₹2వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. అభ్యర్థులు ఈనెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని.. 16న ఉదయం ఆన్‌లైన్ పరీక్ష ఉంటుందని.. అందులో ఎంపికైన వారికి 21 నుంచి క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు.