తెలంగాణలో పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్ కు ఇప్పటికే 40 వేల మంది అప్లై చేసుకున్నారు. 17 వేల పోస్టులుండటంతో ఈసారి 7 లక్షల దరఖాస్తులు వస్తాయని TSLPRB (టీఎస్ఎల్పీఆర్బీ) అంచనా వేస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష, ఈవెంట్లు, మెయిన్ ఎగ్జామ్‌కు సంబంధించి అభ్యర్థులకున్న సందేహాలపై బోర్డు ఛైర్మన్, అడిషనల్ డీజీపీ వి.వి.శ్రీనివాసరావు మీడియా ద్వారా పలు సూచనలు అందించారు. అందులో నుంచి ముఖ్యమైనవి అభ్యర్థుల కోసం ఇక్కడ అందిస్తున్నాం.
60 మార్కులకు క్వాలిఫై.. గెస్ చేస్తే నష్టమే
ప్రిలిమినరీ పరీక్షలో ఈసారి అందరికీ 30 శాతం మార్కులే అర్హతగా పరిగణిస్తారు. 200 మార్కుల ఎగ్జామ్ కావటంతో 60 సరైన సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. అంతకు మించి ఉత్తిగనే గెస్ చేసి.. తప్పుడు సమాధానాలు టిక్ చేయకుండా అభ్యర్థులు జాగ్రత్త పడాలి. అయిదు తప్పు సమాధానాలు టిక్ చేస్తే ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఉదాహరణకు మీరు 60 ప్రశ్నులు కరెక్ట్ సమాధానాలు టిక్ చేసి.. పది ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇస్తే.. మీ స్కోర్ 58కి పడిపోతుంది. అందుకే అభ్యర్థులు ఎగ్జామ్ లో తమకు తెలిసిన సమాధానాలు పక్కాగా టిక్ చేస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్‌లో వచ్చే మార్కులు తుది ఫలితాలకు లెక్కలోకి రావు. మెయిన్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కులుండవు.
ఛాతి కొలతలు.. హైజంవ్ ఉండదు
గతంలో పురుషులకు ఎత్తు, ఛాతీ కొలతలు పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి ఛాతీ కొలతల్లేవు.. నిర్ణీత ఎత్తు ఉంటే సరిపోతుంది. ఈసారి హైజంప్ కూడా లేదు. గతంలో పురుషులకు 100 మీటర్లు. 800 మీటర్ల రన్నింగ్ ఉండేది. ఇప్పుడు అవి లేవు. కేవలం 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. మహిళలకు 100 మీటర్లకు బడులు 800 మీటర్ల రన్నింగ్ పోటీ ఉంటుంది. లోపాలకు, తప్పులు జరిగే ఆస్కారం లేకుండా ఈసారి డిజిటల్ థియోడలైట్, ఆర్‌ఎఫ్‌ఐడీ, బయో మెట్రిక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈవెంట్లు నిర్వహిస్తారు. వినియోగి ఉపయోగించి ఈవెంట్లు నిర్వహిస్తారు.
రన్నింగ్‌కు సింగిల్ ఛాన్స్
రన్నింగ్‌లో ఆర్హత సాధించేందుకు ఒకేసారి అవకాశముంటుంది. షాట్‌పుట్, లాంగ్‌జంప్‌కు మాత్రం
మూడు ఛాయిస్ లుంటాయి. ఈ మూడు ఈవెంట్లలోనూ. అర్హత సాధించాలి. అభ్యర్థులు మొదట రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాతే కొలతలు, లాంగ్‌జంప్ పరీక్షలుంటాయి.