ఎంసెట్-2020 కి అప్లై చేసుకున్న విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్ ను మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ 25, 26 తేదీల్లోనే ఈ ఛాన్స్ ఉంటుంది. తర్వాత మార్చుకోవటం కుదరదు. వెబ్ సైట్లో లాగిన్ అయి తగిన కారణం చూపించి మార్చుకోవాలని ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా దూర ప్రాంతాల్లో సెంటర్లు ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులకు ఇది మంచి ఛాన్స్.
Advertisement
