డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in మరియు www.braou.ac.in లో పొందాలని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరం మొదటీ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 16వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలి. లేదా విశ్వవిద్యాలయ టోల్ ఫ్రీ నెం.18005990101 లేదా హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580 లేదా 040-23680290/291/294/295 ద్వారా తెలుసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2014-15 విద్యాసంవత్సరం నుండి 2022-23 వరకు అడ్మిషన్ పొంది ఉంటే నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS/AP ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది.
B tech computer