నిరుద్యోగులకు డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. 2022 కొత్త ఏడాదిలో అనలిస్ట్ ఇంటర్లుగా పనిచేయడానికి ఫ్రెషర్స్ నుండి అప్లికేషన్స్ కోరుతోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగంలో నియామకాలు వేగవంతమయ్యాయి. అనేక మల్టీ నేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. వారి కోసం స్పెషల్ ఇంటర్న్ షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సమ్మర్ ఇంటర్న్ పొజిషన్ కోసం డెలాయిట్ అధికారిక వెబ్‌సైట్ www2.deloitte.com ద్వారా అప్లై చేసుకోవాలి.
కెనడాలో చాన్స్
ఈ పొజిషన్స్ కోసం ఎంపికైన వారికి డెలాయిట్ కెనడాలోని టొరంటో, మాంట్రియల్ లొకేషన్లలో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తారు. వీరికి డెలాయిట్ సంస్థ ఆకర్షణీయమైన స్టైపెండ్ అందజేస్తుంది. జనవరి 17లోపు దరఖాస్తు చేసుకోవాలి. మాంట్రియల్ కార్యాలయంలో ఇంటర్న్ షిప్ కోసం జనవరి 23లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు:
సమ్మర్ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీలో చేరి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకోండిలా..
డెలాయిట్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
వెబ్‌సైట్‌లో కెరీర్ పేజీని ఓపెన్ చేయాలి.
తర్వాత అనలిస్ట్ ఇంటర్న్, క్రైసిస్ అండ్ రెసిలెన్స్ – రిస్క్ అడ్వైజరీ – సమ్మర్ 2022 (నేషనల్) సెర్చ్ చేయాలి.
తర్వాత అప్లయ్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈ– మెయిల్ ఐడీని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అన్నీ వివరాలు, డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి.. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
డెలాయిట్లో సమ్మర్ ఇంటర్న్షిప్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS