HomeLATESTఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 282 పోస్టులు

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 282 పోస్టులు


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్‌ స్కూల్‌ సొసైటీ (ఏపీఎంఎస్‌) రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన టీచర్ల పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 282
1) ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ): 71

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 44 ఏండ్లు.

జీతభత్యాలు: నెలకి రూ.28,940.
2) పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ): 211

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతో పాటు బీఈడీ.

వయసు: 18 నుంచి 44.

జీతభత్యాలు: నెలకి రూ.31,460.

సెలెక్షన్​ ప్రాసెస్​: బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్‌ మార్కులు, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేది: 7 జనవరి 2022.
వెబ్​సైట్​: www.cse.ap.gov.in

ఆర్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్​


ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 14
1) లీగల్‌ ఆఫీసర్‌ (గ్రేడ్ బి): 2
2) మేనేజర్‌ (టెక్నికల్‌-సివిల్): 6
3) మేనేజర్ (టెక్నికల్‌-ఎలక్ట్రికల్‌): 3
4) లైబ్రరీ ప్రొఫెషనల్‌ (అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌) గ్రేడ్‌ ఏ: 1
5) ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ ఏ: 1
6) ఫుల్‌ టైం క్యురేటర్‌: 1

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
రాత పరీక్ష తేది: 6 మార్చి 2022.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15 జనవరి 2022.
చివరి తేది: 4 ఫిబ్రవరి 2022.
వెబ్​సైట్​: www.rbi.org.in

సీ-డ్యాక్‌లో టెక్నికల్​ అసిస్టెంట్ జాబ్స్​


భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్), బెంగళూరు యూనిట్‌ టెక్నికల్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14
1) టెక్నికల్‌ అసిస్టెంట్‌: 3
2) సీనియర్ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 3
3) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 64
4) సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 55
5) ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01
6) సీడ్యాక్‌ అడ్జంక్ట్‌ ఇంజినీర్‌: 04

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: టెక్నికల్ స్టాఫ్‌ 35 ఏళ్లు, సీడ్యాక్‌ అడ్జంక్ట్‌ ఇంజినీర్‌ 57 ఏళ్లు మించకుండా ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: స్క్రీనింగ్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేది: 18.01.2022.
నోటిఫికేషన్: www.cdac.in

కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో 149 పోస్టులు


భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన నాసిక్‌ రోడ్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ) సూపర్​ వైజర్​ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 149
1) వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 1
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.29,740 నుంచి రూ.1,03,000 వరకు చెల్లిస్తారు.
2) సూపర్‌వైజర్లు: 16
విభాగాలు: టెక్నికల్‌ – కంట్రోల్‌, టెక్నికల్‌ – ఆపరేషన్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.27,600 నుంచి రూ.95,910.
3) సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌: 1
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్‌/ హిందీ) ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.
4) జూనియర్ ఆఫీస్‌ అసిస్టెంట్లు: 6
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.21,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.
5) జూనియర్‌ టెక్నీషియన్లు: 125
విభాగాలు: ప్రింటింగ్‌/ కంట్రోల్‌, వర్క్‌షాప్‌.
అర్హత: ప్రింటింగ్‌, మెకానికల్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌, స్టెనోగ్రఫీ/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేది: 25 జనవరి 2022.
వెబ్​సైట్​: www.cnpnashik.spmcil.com

డీఎస్ఎస్ఎస్‌బీలో 691 పోస్టులు


నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఆఫ్ దిల్లీ(ఎన్‌సీటీ దిల్లీ) ప్ర‌భుత్వానికి చెందిన దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్‌బీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 691
1) జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)/ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌): 116
అర్హత: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.9300 నుంచి 34800 + గ్రేడ్‌ పే 4200 చెల్లిస్తారు.
2) జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌)/ సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌): 575
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.9300 నుంచి 34800 + గ్రేడ్‌ పే 4200 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష (టైర్‌-1, టైర్‌-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10 జనవరి 2022.
చివరి తేది: 9 ఫిబ్రవరి 2022.
వెబ్​సైట్: www.dsssb.delhi.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!