ఇంజినీరింగ్ విద్యార్థులు రీసెర్చ్ చేయడానికి వీలుగా జేఎన్టీయూహెచ్‌లో సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ(సీఆర్‌ఎఫ్)ని ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్ తెలియజేశారు.
రూ.50 లక్షలతో పరికరాలు
కూకట్‌పల్లి క్యాంపస్‌లోని ఓ ప్రత్యేక భవనంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెలలోనే దీన్ని అందుబాటులోకి తేనున్నారు. సీఆర్‌ఎఫ్‌లో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే పరికరాలు సమకూరుస్తున్నారు. 3డీ ప్రింటింగ్ మిషన్లు, రోబోటిక్ ల్యాబ్‌లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లు, ఎలక్ర్టికల్ మైక్రోమిషన్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. సీఆర్‌ఎఫ్ అందరికీ అందుబాటులో ఉండనుంది.
క్యాంపస్ విద్యార్థులకు ఫ్రీ
క్యాంపస్ విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని, అఫిలియేటెడ్ కాలేజీల విద్యార్థులకు తక్కువ ఫీజు వసూలు చేయనున్నారు. ఏటా దాదాపు 200 పరిశోధనలు చేసేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
జేఎన్టీయూలో సెంట్రల్ రీసెర్చ్ చాన్స్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS