తెలంగాణలో డిగ్రీ పీజీ కోర్సుల క్యాలెండర్ రిలీజయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సులకు కామన్ అకడమిక్ క్యాలెండర్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 2022–23 విద్యా సంవత్సరంలో తరగతుల ప్రారంభం నుంచిసెమిస్టర్, అసెసెమెంట్, థియరీ ఎగ్జామ్స్ షెడ్యూలు ఇందులో ఉంది. ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి డిగ్రీ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 9 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పీజీ తరగతులు ఈనెల 31 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పూర్తి క్యాలెండర్ ఇక్కడ అందుబాటులో ఉంది.