సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సీటెట్ 2021 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల చేసింది. సీటెట్ అడ్మిట్ కార్డ్ 2021ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక సీటెట్ పరీక్ష 17 జనవరి 2022 నుండి ప్రారంభమవుతుంది.
జనవరి 17, 21న ఎగ్జామ్స్
డిసెంబర్లో నిర్వహించనున్న సీటెట్ ఎగ్జామ్స్‌ను కరోనా నేపథ్యంలో వాయిదా వేసి 17 జనవరి 2022, 21 జనవరి 2022 న నిర్వహిస్తుంది. జనవరి 17న ఒక్క షిఫ్టులో మాత్రమే పరీక్ష జరగనుంది. జనవరి 21న CTET పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిప్టు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తుంది. రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
వెబ్‌సైట్: www.ctet.nic.in