HomeLATESTనెక్ట్స్ వేవ్​ లో వర్క్​ ఫ్రమ్​ హోమ్​.. రూ.6 లక్షలు జీతం

నెక్ట్స్ వేవ్​ లో వర్క్​ ఫ్రమ్​ హోమ్​.. రూ.6 లక్షలు జీతం

ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్యుటెక్​ కంపెనీ అయిన నెక్ట్స్ వేవ్​ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు బంపర్​ అవకాశాలు కల్పిస్తోంది. కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ నెలకు 50 వేల జీతం పొందే జాబ్​లకు నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ రిక్రూట్​మెంట్​లో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇది పక్కాగా హైదరాబాద్​ బేస్​డ్​ కంపెనీ. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల స్టడీ మెటీరీయల్ ఈ కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. ప్రధానంగా సాఫ్ట్​వేర్ కోర్సులు​, కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​, స్టడీ మెటీరీయల్స్​ ఈ కంపెనీ తయారు చేస్తుంది.  వీటిని స్టూడెంట్స్​కు అర్థమయ్యేలా కమ్యూనికేట్​ చేయాలనేది కంపెనీ తాజా టాస్క్​.

ఇప్పుడు ప్రకటించిన పోస్టులను బిజినెస్​ డెవలప్​మెంట్​ అసోసియేట్ గా పిలుస్తారు. నెక్ట్స్​వేవ్​లో ఉన్న వివిద కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, తల్లిదండ్రలకు అర్థమయ్యేలా వివరించటం వీళ్ల జాబ్​. తద్వారా ఆయా కోర్సుల్లో విద్యార్థులు జాయిన్​ అయ్యేలా కమ్యునికేట్​ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.6 లక్షల ప్యాకేజీతో పాటు ఇన్సెంటివ్స్​ అదనంగా ఉంటాయి. మొత్తం ఖాళీలు వంద. ఎనీ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలనేది కండీషన్. అప్లై చేసుకున్న తర్వాత వీడియో లింక్​ ఆధారంగా ఒక కొత్త వీడియో క్రియేట్​ చేసి అప్​లోడ్​ చేయాలి. అనంతరం ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Advertisement

జాబ్​ రోల్​: నెక్ట్స్​వేవ్​లో ఉన్న వివిద కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, తల్లిదండ్రలకు అర్థమయ్యేలా వివరించాలి. వారు కోర్సుల్లో జాయిన్​ అయ్యేలా కమ్యునికేట్​ చేయాలి.

సాలరీ: వార్షిక వేతనం రూ.6 లక్షలు+ఇన్సెంటివ్స్​

ఖాళీలు: 100

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 30 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: అప్లై చేసుకున్న తర్వాత వీడియో లింక్​ ఆధారంగా కొత్తగా వీడియో క్రియేట్​ చేసి అప్​లోడ్​ చేయాలి. అనంతరం ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

వెబ్​సైట్​: www.ccbp.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!