ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న తెలంగాణ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు తాజా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 445 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్ 372, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 73 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల డీసీసీబీల వారీగా ఈ పోస్టులు ఉన్నాయి. అదిలాబాద్‌లో 58 స్టాఫ్ అసిస్టెంట్, 11 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 45 స్టాఫ్ అసిస్టెంట్, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, కరీంనగర్లో 65 స్టాఫ్ అసిస్టెంట్, 19 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఖమ్మంలో 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. మహబూబ్‌నగర్‌లో 25 స్టాఫ్ అసిస్టెంట్, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. మెదక్‌లో 57 స్టాఫ్ అసిస్టెంట్, 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, నల్గొండలో 26 స్టాఫ్ అసిస్టెంట్, 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వరంగల్‌లో 46 స్టాఫ్ అసిస్టెంట్, 4 అసిస్టెంట్ మేనేజర్ పోటీలు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 19 నుంచి అప్లికేషన్స్ ప్రారంభమై మార్చి 6వ తేదీ వరకు అప్లై చేసుకునే సమయం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకొని అర్హత, అప్లికేషన్ ఫీజు, రిజర్వేషన్, ఎగ్జామ్ ప్రాసెస్ వివరాల గురించి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. 19 వ తేదీ నుంచి వెబ్సైట్లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి.
వెబ్సైట్: www.tscab.org లో చూసుకోవాలి.