నిరుద్యోగులకు మరో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 864 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితిని 27 ఏళ్లుగా నిర్ణయించింది NTPC. అభ్యర్థులు తప్పనిసరిగా GATE-2022 పరీక్షకు హాజరై ఉండాలి. ఆ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అప్లికేషన్ లింక్-Link