డిగ్రీ అర్హతతోనే కేంద్ర సర్వీసుల్లో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ జాబ్‌లు పొందాలనుకునే వారికి మళ్లీ ఛాన్స్ వచ్చింది. 345 పోస్టులతో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (1)–2021 ఎగ్జామ్‌కు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు
………………………
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ 100
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ 26
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మెన్), చెన్నై 170
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఉమెన్) 17
……………………
మొత్తం 345
………………………
అర్హత:
ఐఎంఏ కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, నేవల్ అకాడమీకి ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఏదైనా డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు:
మిలిటరీ, నావల్ అకాడమీకి 1998 జనవరి 2 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించిన వారు అర్హులు. అంటే 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 1998 జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. అంటే 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు. డీజీసీఏ అప్రూవ్డ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగిన వారికి 26 ఏళ్ల వరకు అనుమతిస్తారు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి 1997 జనవరి 2 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.
నిబంధనలు: నిర్దేశిక శారీరక ప్రమాణాలు కలిగిన 25 ఏళ్లలోపున్న అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారు ట్రైనింగ్‍లోనూ వివాహం చేసుకోకూడదు. మహిళా అభ్యర్థులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై
దరఖాస్తు విధానం: వెబ్సైట్లో పార్ట్–I, పార్ట్–II అనే రెండు దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
చివరితేది: 17 నవంబర్ 2020
దరఖాస్తుల ఉపసంహరణ: 2020 నవంబర్ 24 నుంచి 30 వరకు
పరీక్షతేది: 7 ఫిబ్రవరి 2021
వెబ్సైట్: www.upsc.gov.in
సెలెక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టేజ్-1లో మూడు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ముద్రిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్టేజ్-2 లో సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. నెగెటివ్ మార్కులున్నాయి. 0.33 శాతం కోత విధిస్తారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో పదోతరగతి స్థాయిలో ప్రశ్నలిస్తుండగా మిగిలిన సబ్జెక్టుల్లో డిగ్రీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి.
అర్హతలు:
ఆర్మీకి దరఖాస్తు చేసేవారు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. నేవీకి 157, ఎయిర్‌ఫోర్స్‌కు 162.5, ఆఫీసర్స్ ఉమెన్ కు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి. శ్వాస పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ విస్తరించాలి.
ఎయిర్‌ఫోర్స్, నేవీకి దరఖాస్తు చేసినవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైనవారు, కళ్లద్దాలు ధరించే అలవాటున్న అభ్యర్థులు ఎయిర్‌ఫోర్స్‌కు అనర్హులు.