టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ లో అర్హత సాధించలేదా? అయితే.. మీకో గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నోటిఫికేషన్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా విడుదల చేసింది. జులై – 2023కు సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది సీబీఎస్ఈ.
అధికారిక వెబ్ సైట్: https://ctet.nic.in/
ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు.. అంటే ఏప్రిల్ 27న ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జులై నుంచి ఆగస్టు మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు.