HomeLATESTనిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు మరో 2 రోజులే

నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు మరో 2 రోజులే

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 247 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టుల్లో 217 పోస్టులు హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు 30 పోస్టులు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తును ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండి అంటే.. మే 12 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

విద్యార్హతల వివరాలు:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 12వ తరగతిలో 60 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ శిక్షణతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఇవ్వబడుతుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి:
దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక సైట్ rectt.bsf.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత, దరఖాస్తు ఫారమ్ నింపాలి. ఈ నెల 22వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!