తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా కటాఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కాగా టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అభ్యర్థులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఒకే విధంగా 60 మార్కులను కటాఫ్‌గా పెట్టారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మేలు జరగనుంది. దీంతో ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించే అవకాశముంది. బీసీలకు 50 మార్కులు కటాప్‌గా పరిగణించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేడో రేపో టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) దీనిపై ప్రకటన విడుదల చేయనుంది.
Telangana,colcher