నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022 సంవత్సరానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్ఎం-జేఈఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బీఎస్సీ(హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.
అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్(10+2)లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 జూలై 2022 నాటికి జనరల్, ఓబీసీ అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీలకు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల(ఎంసీక్యూ) రూపంలో ఉంటుంది. కింద సూచించిన విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలైటికల్ ఆప్టిట్యూడ్ -నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ నుంచి- 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి- 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్ – 50 ప్రశ్నలతో కలిపి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1మార్కు కోత విధిస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మీడియంలో ఉంటుంది. పరీక్షకు 3గంటలు సమయం కేటాయించారు.
అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ ఓబీసీ- రూ.1000, జనరల్-ఈడబ్ల్యూఎస్-రూ.700, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ-రూ.450, ట్రాన్స్‌జెండర్-రూ.450 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. మే 3వ తేదీ లోపు అభ్యర్థులు అప్లై చేయాలి. మే 28న ఎగ్జామ్ నిర్వహిస్తారు.
వెబ్సైట్: www.nchmjee.nta.nic.in