రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో ఖాళీ గా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 950 ఖాళీలని ఆర్బీఐ భర్తీ చేయనుంది.ఈ నోటిఫికేషన్ లింక్ ఫిబ్రవరి 17 వ తేదీన ఓపెన్ అవుతుంది.ఫైనల్ రాత పరీక్ష మార్చి 26,27 తేదీల్లో జరగనుంది. పూర్తి వివరాలు త్వరలోనే ఆర్ బీ ఐ వెబ్ సైట్ లో లభ్యం కానున్నాయి.
మొత్తం 950 పోస్టులకు ఫిబ్రవరి 17న అప్లికేషన్స్ ప్రారంభమై మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేయాలి. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషీయన్సీ టెస్టులో సాధించిన మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 26, 27వ తేదీల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వెబ్సైట్: www.rbi.org.in
