పాలిటెక్నిక్ పరీక్షలకు రద్దు చేసిన ప్రభుత్వం కొత్త టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీకయినట్లు గుర్తించటంతో ఈ పేపర్లను తిరిగి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో జరిగిన పరీక్షల పేపర్లు లీకైనట్టు సమాచారం అందడంతో స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీసర్లు విచారణ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో ఈ పేపర్లు లీకైనట్టు బయటపడింది. ఎలక్ట్రికల్ సర్కూట్స్, అప్లయిడ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్రశ్నపత్రాలు లీకైనట్టు గుర్తించారు.
కాలేజీ చీఫ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఒక లెక్చరర్ ఫోన్‌ల నుంచి వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ టైమ్ కంటే అరగంట ముందు ఈ ప్రశ్నపతాలు బయటకు వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. చేగుంట పాలిటెక్నిక్ కాలేజీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ లీకేజ్ వ్యవహారం బయటపడింది. ఎగ్జామ్ టైమ్ అయినప్పటికీ విద్యార్థులు హాల్‌కు రాకపోవటం, ఫోన్లతో బిజీగా ఉండటంతో.. ఏం జరిగిందని ఆరా తీయటంతో పేపర్లు వాట్సప్‌లో వచ్చాయని బయటపడింది. అసలు పేపర్.. వాట్సప్‌లో వచ్చిన పేపర్ సేమ్ టు సేమ్ ఉంటంతో చేగుంట కాలేజీ ప్రిన్సిపల్ టెక్నికల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎగ్జామినేషన్ అబ్ద్బర్వర్‌ను సస్పెండ్ చేశారు. కాలేజీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ రెండు రోజులు జరిగిన పరీక్షలను రద్దు చేసి ఈ నెల 15, 16వ తేదీల్లో తిరిగి నిర్వహించేందుకు కొత్త టైమ్ టేబుల్ రిలీజ్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంపై ఎస్‌బీటీఈటీ సెక్రెటరీ ఇప్పటికే అబ్బుల్లాపూర్‌మెట్ పోలీసులకు పిర్యాదు చేశారు.
పాలిటెక్నిక్ పేపర్లు లీక్.. రద్దయిన ఎగ్జామ్స్‌కు కొత్త టైమ్ టేబుల్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS