HomeLATESTరాత పరీక్ష లేకుండానే.. పవర్​ గ్రిడ్ కార్పొరేషన్​లో 1233 పోస్టులు

రాత పరీక్ష లేకుండానే.. పవర్​ గ్రిడ్ కార్పొరేషన్​లో 1233 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్​ గ్రిడ్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ (PGCIL) వివిధ అప్రెంటిస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ త‌దిత‌ర అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష లేకుండానే సంబంధిత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్టుల‌ను బ‌ట్టి అభ్యర్థులు డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్‌డ‌బ్ల్యూ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

Advertisement

మొత్తం పోస్టులు : 1233
ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1233 ఖాళీలను భర్తీ చేస్తుండ‌గా.. వీటిలో సదరన్​ రీజియన్​ హైదరాబాద్‌ పరిధిలో 70 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై 30 వ‌ర‌కు అభ్యర్థులు అప్లై చేసుకోవ‌చ్చు. అభ్యర్థులకు 18 ఏండ్లు నిండి ఉండాలి.

పోస్టులు : డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్.

Advertisement

అర్హతలు: ఐటీఐ అప్రెంటిస్‌ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, డిప్లొమా అప్రెంటిస్‌ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ కోసం బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒక కోర్సు.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఎంబీఏ, ఎంఎస్‌డ‌బ్ల్యూ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

సెలెక్షన్​ : సంబంధిత కోర్సులో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

స్టయిఫండ్‌: 1. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల‌కు నెల‌కు రూ.15,000, 2. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల‌కు నెల‌కు రూ. 13,500, 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నెల‌కు రూ. 17,500

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!