ఏపీలోని నిరుద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. భారీగా నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అంటే.. డిసెంబర్ 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను http://cfw.ap.nic.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
జీఎన్ఎం&బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తులను పంపించాల్సిన చిరునామాలు:
1. Regional Director of Medical and Health Services, Opp.Bullaiah College, Resapuvanipalem, Visakhapatnam,
2. Regional Director of Medical and Health Services, District Headquarters Hospital Compound, Rajamahendravaram,
3.Regional Director of Medical and Health Services, Aswini Hospital Backside, Old Itukulabatti Road, Guntur,
4. Regional Director of Medical and Health Services, Old RIMS, Kadapa.