HomeLATESTతెలంగాణ విద్యారంగం

తెలంగాణ విద్యారంగం

విద్య – రెసిడెన్షియల్స్

Advertisement

తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి.  కొత్తగా 661 ( 608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 959 (906+53డిగ్రీ కాలేజీలు)కి తీసుకువచ్చింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించారు. ఈ లెక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ (డిగ్రీ రెసిడెన్షియల్స్ మినహాయిస్తే) స్కూళ్లలో రాబోయే ఐదేళ్లలో 4,74,240 మంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న గురుకులాల్లో మొత్తం 2.72 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.

మైనారిటీలకు కొత్తగా 192 రెసిడెన్షియల్ స్కూల్స్

తెలంగాణ రాకముందు మైనారిటీలకు 12 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే వుండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరమే కొత్తగా 71 మైనారిటీ రెసిడెన్షియల్స్, 2017 జూన్ లో మరో 121 రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. దీంతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 204 కు చేరింది. 2018-19 బడ్జెట్లో మైనారిటీ గురుకులాల కోసం రూ.735 కోట్లు కేటాయించారు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో మొత్తం 57,980 విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30 వేలకు చేరుకుంటుంది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్ష  రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2016-17లో 5,6,7 వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు.  ప్రతీఏడాది ఒక్కోతరగతి పెంచుకుంటూ పోతారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు, యూనిఫారం, బెడ్డింగ్, షూస్, క్రీడా సౌకర్యాలు, గ్రంధాలయం, పరిశోధనశాలలన్నింటినీ ఉచితంగా సమకూరుస్తున్నారు.

Advertisement

8 మైనారిటీ గురుకులాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ : కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా, 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్య అందుబాటులోకి రాబోతున్నది. ఇలా హైదరాబాద్‌లో 8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ టెమ్రీస్‌ అధికారులు 1 మార్చి 2020న  ఉత్తర్వులు విడుదల చేశారు. వీటిల్లో సిబ్బందిని నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీసీలకు కొత్తగా 261 గురుకుల పాఠశాలలు, 1 డిగ్రీ కళాశాల – మొత్తం 281

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీల కోసం 2016-17లో 17 గురుకులాలు,  2017-18 లో 125 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పాతవి 19, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటయిన 142 కలుపుకొని మొత్తం రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాల సంఖ్య 161  కి చేరింది. ఒక డిగ్రీ కళాశాలను కూడా కలుపుకుంటే వీటి సంఖ్య 162 కి చేరింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి  నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మరో 119 బిసి గురుకులాలను ఏర్పాటు చేశారు. వీటిని 17జూన్, 2019న ప్రారంభించారు. దీంతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 281 కి చేరింది. బిసి గురుకులాల్లో మొత్తం 39,924 మంది చదువుకుంటున్నారు. మొదటి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి  ఏడాది ఒక్కో గురుకులంలో 240 మంది పిల్లలకు ప్రవేశం కల్పించారు. ఐదేళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో స్కూళ్లో 640 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్లో రూ.296 కోట్లు కేటాయించారు.ఈ నాలుగేండ్ల బడ్జెట్లలో గురుకులాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.561 కోట్లు కేటాయించింది. 2018-19 లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విద్యార్ధులు 90.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 65% ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకన్నా గురుకుల విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపించారు. వీటి పరిధిలో 1,633 మంది పరీక్షకు హాజరుకాగా 1,474 మంది ఉత్తీర్ణులయ్యారు.

Advertisement

ఎస్సీలకు కొత్తగా 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ కళాశాలలు- మొత్తం 134

రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా ఎస్సీలకు 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం వీటి సంఖ్య 264 కి చేరింది. వీటిలో 2017-18లో విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించారు.  2018-19 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎస్సీ గురుకులాల్లోని విద్యార్ధులు 84.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ గురుకులాల నుంచి 8,877 మంది పరీక్షకు హాజరుకాగా.. 7,484 మాంది పాసయ్యారు. 14 కళాశాలలు నూరుశాతం ఫలితాలు సాధించగా.. 5,165 మంది ఏ గ్రేడ్ సాధించారు. పదో తరగతి పరీక్షల్లో 2018-19 విద్యాసంవత్సరంలో 92.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 8,854 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,230 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎస్టీలకు కొత్తగా 51గురుకుల పాఠశాలు, 22 డిగ్రీ కళాశాలలు – మొత్తం 73

Advertisement

రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్టీల కోసం 96 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్ర అవతరణ తరువాత ఎస్టీల కోసం 51 గురుకులాలు ప్రారంభించారు. అలాగే 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ప్రస్తుతం పాతవి కొత్తవి కలిపి మొత్తం రాష్ట్రంలో 169 గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,317 మంది పరీక్షలు రాయగా, 2732 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,611 మంది ఏ గ్రేడ్ సాధించారు.

రాష్ట్రంలోని మొత్తం గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు

 కొత్త రె.పా.కొత్త డిగ్రీ కాలేజీలుమొత్తం కొత్తవిమొత్తం పాతవిమొత్తం
ఎస్సీ10430134134268
ఎస్టీ51227396169
మైనారిటీ19219212204
బీసీ261126219281
జనరల్3737
 60853661298959 (906 + 53)
 2016-172017-182018-19రాష్ట్రం ఏర్పడిన తరువాతరాష్ట్రం ఏర్పడక ముందుమొత్తం
పాఠశాలలు243246119608298906
డిగ్రీ కాళేజీలు53 5353
    542298959

తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వివరాలు

Advertisement
క్ర.సం.శాఖ2014 జూన్ ముందు స్కూళ్లు – టీచర్లు-విద్యార్థులుతెలంగాణ వచ్చాక… స్కూళ్లు – టీచర్లు-విద్యార్థులుస్కూళ్ల సంఖ్య
1ఎస్సీ1341,18382,0631041,85448,897238
2ఎస్టీ961,15331,391611,42023,660157
3మైనార్టీ122587,6801923,93082,480204
4బీసీ192428,0002613,66983,680280
5జనరల్3773916,12011,88037
 మొత్తం2983,5751,45,25461810,8732,50,597916

డిగ్రీ కాలేజీలు (2014 తర్వాత)

క్రమ సంఖ్యశాఖకాలేజీలులెక్చరర్లువిద్యార్థులు
1ఎస్సీ3048325,200
2బీసీ131800
3ఎస్టీ228807,835
 మొత్తం53139433,835

రెసిడెన్షియల్ విద్యాసంస్థల మొత్తం వివరాలు

 గురుకులాలువిద్యార్థులు టీచర్లు/లెక్చరర్లు  
పాఠశాలలు91615,872
డిగ్రీ కాలేజీలు531,394
మొత్తం96917,266
   

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న డ్రాపౌట్స్

Advertisement

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రా పౌట్స్ తగ్గుతూ, రిటెన్షన్ (విద్యా సంవత్సరం చివరి వరకు కొనసాగడం) పెరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ తన వార్షిక నివేదికలో(2017-18) తెలిపింది. 33 జిల్లాల్లో కలిపి 69.83 శాతం రెటెన్షన్ రేటు నమోదైంది. 2016-17లో డ్రాపౌట్స్ రేటు 18 శాతం ఉండగా, 2017-18 లో 3.3 శాతానికి తగ్గింది. ప్రమోషన్ రేటు (పై తరగతులకు వెళ్లేవారు) 96.4 శాతం నమోదయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫారాల పంపిణీ, వందశాతం మెస్ చార్జీలు తదితర కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గాయి.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పెరుగుతున్న అడ్మిషన్స్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల బలోపేతానికి చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసింది. దీంతో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2016-17లో 22,820 అడ్మిషన్లు నమోదవగా.. 2017-18లో 27,802, 2018-19 లో 42,266 మంది ప్రవేశాలు పొందారు. 2019-20 విద్యా సంవత్సరంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో కలిపి మొత్తం 70 వేల పైచిలుకు సీట్లు అందుబాటులోకి తేవడంతో గతం కంటే ఈ సారి 39శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. కోర్సు, మీడియం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సీట్లు పెంచారు. ముఖ్యంగా బీకాం కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంచారు. డిమాండ్ లేని కోర్సులను మూసివేసి, ఉద్యోగాలు పొందేందుకు అనుకూలంగా ఉండే వాటినే అందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.

Advertisement

విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఇబీసీ, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో కేవలం పది లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు అందిస్తున్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ. 4 లక్షల 50 వేలకు పెంచారు. పది శాతం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు హ్యుమనిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డిసెంబర్ 2019 నాటికి 1,436 మంది విద్యార్థులు లబ్ధిపొందగా.. వీరి కోసం ప్రభుత్వం రూ.326.51 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఉపకార వేతనంతో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకమే ఉన్నా.. వందమందిలోపే విద్యార్థులు ఎంపికయ్యారు. స్కాలర్‌షిప్ రూ. 5 లక్షలు కూడా ఉండేదికాదు. ఇప్పుడు రూ.20 లక్షలు కేటాయిస్తున్నారు. 2018-19 బడ్జెట్లో ఈ పథకం అమలుకు రూ.174.50 కోట్లు కేటాయించారు.

మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్

Advertisement

ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్’ పథకాన్ని 2015 మే 19న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమం అమలులో వుంది. అదే తరహాలో మైనారిటీలకు కూడా ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువుకోసం  విదేశాలకు వెళ్లాలంటే, చాలామందికి ఆర్థిక స్థోమత వుండదు. అలాంటి వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నది. ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్ షిప్ తోపాటు విమానయాన ఖర్చులు కూడా అందించేవారు.  కానీ, ఈ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఆదాయ పరిమితిని కూడా 4.5 లక్షల రూపాయలకు పెంచారు.  మైనారిటీల ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్’ ద్వారా 2020 జనవరి నాటికి 1,436 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.218.92 కోట్లు ప్రభుత్వం సాయం అందించింది.

ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 35 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం (అనగా 2014-15) నుండి 2019 ఆగస్టు 1 నాటికి 489 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.72.99 కోట్లు, 146 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.21.65 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం పొందినవారిలో 55 మంది అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తుండటం విశేషం. మరికొందరు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో చదువుకుంటున్నారు. ఎస్సీలలో దాదాపు 89 శాతం మంది అమెరికాలోని ప్రముఖ వర్సిటీల్లో చేరారు.

Advertisement

మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. విదేశీ విద్యానిధి

బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెడుతూ 2016 అక్టోబర్ 10న జి.ఓ.నెం.23 జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.  2019 ఆగస్టు నాటికి 536 మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందారు. వీరికోసం రూ. 75.97 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కువమంది ఆస్ట్రేలియా, కెనడాల్లోని వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

ఈబీసీలకు..

ఆగస్టు 2019 నాటికి 34 మంది ఈబీసీ విద్యుర్థులకు ఈ పథకం ద్వారా సహాయం అందించారు. వీరికి ప్రభుత్వం రూ.3.40 కోట్ల సాయాన్ని అందజేసింది.

విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్

తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం నాలుగేళ్లపాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం చేసింది. దీంతో ఈ మొత్తాలు రూ.1,756 కోట్ల వరకు చేరగా, వాటన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. విద్యార్థుల సంక్షేమం కోసం పాతఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు, ఈబీసీ, వికలాంగులైన 13 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారు. కేంద్రం భరించాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీల రీయింబర్స్ మెంట్ పథకానికి అరకొరగా నిధులిస్తున్నది. 2018-19 విద్యాసంవత్సరంలో విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కోసం ప్రభుత్వం రూ.3,282 కోట్లు కేటాయించింది. 2020-21 ఫీజురీయింబర్స్ మెంట్ కోసం రూ.2650 కోట్లు కేటాయించింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటైన నాలుగున్నరేండ్లలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం  రూ.10,202.19 కోట్లు ఖర్చు చేసింది.

విద్యార్థులకు మెస్ చార్జీలు పెంపు

హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను ప్రభుత్వం వివిధ శ్లాబు కేటగిరీల్లో 30 శాతం నుంచి 90 శాతం వరకు పెంచింది. ఈ మేరకు 2017 మార్చి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పెంపుదలతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం మూడో తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు చెల్లించే రూ.750 రూ.950 వరకు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చెల్లించే రూ.850 నుంచి రూ. 1,100 పెంచింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ కళాశాల హాస్టల్లోని విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్‌ చార్జీలను ప్రభుత్వం రూ.1,050 నుండి రూ.1,400 పెంచింది. కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, డే స్కాలర్స్ విషయంలో 4 కేటగిరీల్లో 13 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ.962 నుంచి రూ.1,500, పీజీ విద్యార్థులకు 682 నుంచి రూ. 1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.580 నుంచి రూ.1,000, ఇంటర్మీడియెట్ వారికి రూ.520 నుంచి 750, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ కు, డే స్కాలర్స్ కి ప్రొఫెషనల్ కోర్సులకు రూ.462 నుంచి రూ.680, పీజీ కోర్సులకు రూ.442 నుంచి రూ.650, డిగ్రీ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500, ఇంటర్ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500 వరకు మెస్ చార్జీలు పెరిగాయి.

పాఠశాల విద్యార్థులకు పెరిగిన మధ్యాహ్న భోజన చార్జీలు

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లలో దాదాపు 19 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీరికి అయ్యే భోజన ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాథం భరిస్తుంది. 9, 10 తరగతుల్లోని 4.73 లక్షల మంది విద్యార్థుల భోజన ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా  మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం 2019 మే 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో వంట ఖర్చు రూ. 4.13 నుంచి రూ. 4.35కు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ. 6.18 నుంచి రూ. 6.51కు, 9, 10 తరగతులకు కూడా రూ. 6.18 నుంచి రూ. 6.51కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 గుడ్డు ధరతో కలిపి ఉన్నత పాఠశాలల్లో రూ. 8.51కు పెంచింది. పెంచిన భోజన ధరలతో ప్రభుత్వంపై అధనంగా రోజుకు రూ.7 లక్షల అదనపు భారం పడుతుంది.

సంపూర్ణ అక్షరాస్యత కోసం ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ కార్యక్రమం

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమం అమలు చేయడానికి అధికారులు విధివిదానాలు తయారుచేస్తున్నారు. నిరక్షరాస్యుల తాజా సమాచారం కోసం గ్రామాలవారీగా నిరక్షరాస్యుల వివరాలను సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. 

ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్స్‌

యూపీఎస్సీ, టిఎస్‌పిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం పేద విద్యార్థులకు భారంగా మారింది. పైగా మంచి శిక్షణకు హైదరాబాద్‌లో తప్ప ఇతర చోట్ల స్టడీ సర్కిళ్లు లేవు. అందుకే ప్రభుత్వం జిల్లాస్థాయిలోనే ఎస్సీ,ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీలకు 1, ఎస్టీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు వుండేవి. వీటి నిర్వహణకు రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. పాత వాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బిసి లకు 10, మైనారిటీలకు 1 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు అయ్యాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ఖర్చు చేసింది. వివిధ అంశాలపై శిక్షణతోపాటు వసతి, భోజనం, గ్రంథాలయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్, పుస్తకాల కొనుగోలు నిధి వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

కాళోజీ పేరిట వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ

వరంగల్ నగరంలో కాళోజీ నారాయణ రావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 2014 సెప్టెంబర్ 25న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. దీంతో తెలంగాణలోని వైద్య కళాశాలలన్నీ విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధి నుంచి వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. ఇందుకోసం 2016 ఫిబ్రవరి 9న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారంగా 27 అలోపతి (మోడరన్ మెడిసిన్) మెడికల్ కాలేజీలు (3950 అండర్ గ్రాడ్యుయేట్-యూజీ సీట్లు, 1408 పీజీ సీట్లు, 90 సూపర్ స్పెషాలిటీ సీట్లు), 12 డెంటల్‌ కాలేజీలు (1140 యూజీ, 278 పీజీ సీట్లు), 5 హోమియోపతి కాలేజీలు (450 యూజీ, 30 పీజీ సీట్లు), 2 ఆయుర్వేద కాలేజీలు (200 యూజీ, 38 పీజీ సీట్లు), 1 నేచురోపతి కాలేజీ (30 యూజీ సీట్లు), 2 యునానీ కాలేజీలు ( 175 యూజీ, 48 పీజీ సీట్లు), 77 నర్సింగ్ కాలేజీలు ( 4230 యూజీ, 383 పీజీ సీట్లు), 20 బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కాలేజీలు (680 యూజీ సీట్లు), 16 ఫిజియోథెరపీ కాలేజీలు (850 యూజీ-బీపీటీ సీట్లు, 112 పీజీ-ఎంపీటీ సీట్లు)తోపాటు న్యూట్రిషన్, పబ్లిక్‌ హెల్త్‌ కాలేజీలు, ఉద్యోగులు కూడా కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి వస్తారు.

కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు

రాష్ట్ర వైద్య విద్యను మరింత అభివృద్ధి చేయడం కోసం కొత్తగా నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండలలో వీటిని ఏర్పాటు చేసింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ 22 మే, 2018న సంతకం చేశారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున సీట్లు కేటాయించారు. దీనికి అనుబంధంగా 750 పడకల ఆసుపత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి.  అలాగే, హైదరాబాద్ సనత్ నగర్ లో  ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభమైంది. దీంతో మరో 100 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

బీబీనగర్ లో ఎయిమ్స్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ లో 2019 ఆగస్టు నుంచే ప్రజలకు  వైద్యసేవలు అందిస్తుండగా,  డిసెంబర్ 4న అధికారికంగా  ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించి ఎయిమ్స్ లో రోగులకు 1000 పడకల ఆస్పత్రి సౌకర్యంతోపాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు 50 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

వరంగల్ లో సైనిక్ స్కూల్

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ సైనిక్‌ స్కూల్‌ను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో 53.16 ఎకరాల్లో నెలకొల్పనున్నారు.  సైనిక్ స్కూల్ స్థాపన కోసం 2017 మార్చి 2న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఓ.యూ.పై సంతకాలు చేశాయి. నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఒక వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డి.పి.ఆర్.) సిద్ధం చేసింది.  భవనాల నిర్మాణానికి, ఇతర సామగ్రి, పరికరాలకు రూ.100 కోట్లతో డిపిఆర్ ను సిద్ధం చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సైనిక్ స్కూల్ కి భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.4 కోట్లను విడుదల చేసింది.

కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

రాష్ట్రంలో 32 కేంద్రీయ విద్యాలయాలు, 9 జవహర్ నవోదయ కేంద్రాలున్నాయి. కొత్తగా మరో 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. నిజామాబాద్ టౌన్, భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో  వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!