సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలో వాయిదా పడ్డ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఏడు ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలతో షెడ్యూలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు ఏటేటా కోట్ల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరవుతున్నారు. వచ్చే ఏడాది పరీక్షలకు సంబంధించిన క్యాలెండర్ ను త్వరలోనే విడుదల చేస్తామని ఎస్ ఎస్ సీ ప్రకటించింది.
సీ హెచ్ఎస్ఎల్ 2019(టైర్-1), జూనియర్ ఇంజినీరు (పేపర్-1), 2019 సెలక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ 2020-ఫేజ్ 8, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డి పరీక్ష2019, దిల్లీ పోలీసు ఎస్ఐ, సీఏపీఎఫ్ పరీక్ష (పేపర్-1), జూనియర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (పేపర్-1), సీజీఎల్ ఈ (టైర్-2)-2019 పోస్టులకు సంబంధించి గతంలో వాయిదా పడ్డ పరీక్షల తేదీల వివరాలవి..
పూర్తి వివరాలకు https://ssc.nic.in/
