ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- స్పెషలైజ్డ్ సెగ్మెంట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో కింది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: మొత్తం 606 ఖాళీలు ఉన్నాయి. అందులో చీఫ్ మేనేజర్- ఐటీ (సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్) ఎస్‌ఎంజీఎస్-IV: 2 పోస్టులు, చీఫ్ మేనేజర్- ఐటీ (క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్) ఎస్‌ఎంజీఎస్-IV: 1, చీఫ్ మేనేజర్- ఐటీ (ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్) ఎస్‌ఎంజీఎస్-IV: 1, చీఫ్ మేనేజర్- ఐటీ (ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్) ఎస్‌ఎంజీఎస్-IV: 1, సీనియర్ మేనేజర్- ఐటీ (అప్లికేషన్ డెవలపర్) ఎంఎంజీఎస్-III: 4, సీనియర్ మేనేజర్- ఐటీ (డీఎస్‌వో ఇంజినీర్) ఎంఎంజీఎస్-III: 2, సీనియర్ మేనేజర్- ఐటీ (రిపోర్టింగ్ & ఈటీఎల్ స్పెషలిస్ట్, మానిటరింగ్, లాగింగ్) ఎంఎంజీఎస్-III: 2, సీనియర్ మేనేజర్ (రిస్క్) ఎంఎంజీఎస్-III: 20, సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్) ఎంఎంజీఎస్-III: 14, మేనేజర్- ఐటీ (ఫ్రంట్-ఎండ్/ మొబైల్ యాప్ డెవలపర్) ఎంఎంజీఎస్-II: 2, మేనేజర్- ఐటీ (ఏపీఐ ప్లాట్‌ఫాం ఇంజినీర్/ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్) ఎంఎంజీఎస్-II: 2, మేనేజర్ (రిస్క్) ఎంఎంజీఎస్-II: 27, మేనేజర్ (క్రెడిట్) ఎంఎంజీఎస్-II: 371, మేనేజర్ (లా) ఎంఎంజీఎస్-II: 25, మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్) ఎంఎంజీఎస్-II: 5, మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) ఎంఎంజీఎస్-II: 19, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్) జేఎంజీఎస్-I: 2, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజనీర్) జేఎంజీఎస్-I: 2, అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్) జేఎంజీఎస్-I: 1, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) జేఎంజీఎస్-I: 30, అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్) జేఎంజీఎస్-I: 73 పోస్టులు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్/ ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ,సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.unionbankofindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.