HomeLATESTయూజీసీ నెట్​ 2023 నోటిఫికేషన్​

యూజీసీ నెట్​ 2023 నోటిఫికేషన్​

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) డిసెంబర్​ 2023 పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చీ ఫెలోషిప్‌, విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను యూజీసీ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. అప్లికేషన్ల ప్రక్రియ సెప్టెంబర్​ 30 నుంచి మొదలైంది. ఆన్​లైన్​లో అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షలు డిసెంబర్‌ 6 నుంచి 22 తేదీల వరకు జరగనున్నాయి. మొత్తం 83 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది.

Advertisement

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-09-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:28-10-2023.

Advertisement

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ:29-10-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 30-31 అక్టోబర్‌, 2023.

పరీక్ష తేదీలు: 06-12-2023 నుంచి 22-12-2023 వరకు.

Advertisement

ఫలితాల వెల్లడి:10-01-2024.

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, తదితరాలు.

అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

Advertisement

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.12.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!