టీఎస్ టెట్ అప్లికేషన్ తప్పులు దొర్లిన వారు ఎడిట్ చేసుకునేందుకు టెట్ అధికారులు అవకాశం కల్పించారు. జూన్ 6 మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జూన్ 12న పరీక్ష ఉన్నందున ఆరు రోజుల పాటు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేసి హాల్‌టికెట్‌ను పొందవచ్చు. అయితే టెట్ దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులు సవరించుకునేందుకు ముందుగా ఎలాంటి ఎడిట్ ఆప్షన్‌ను ఇవ్వలేదు. తప్పుగా అప్లికేషన్ ఫారం నింపిన వారికి హాల్‌టికెట్లు మంజూరు చేయమనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో చాలా మంది అభ్యర్థులు చివరి సమయంలో రెండు సార్లు అప్లై చేశారు.
కానీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ టెట్ అధికారులు హాల్ టికెట్లను జారీ చేశారు. అప్లై చేసే సమయంలో చేసిన తప్పులు పేరులో దోషాలు, తండ్రిపేరు, తల్లిపేరు, పుట్టిన తేదీ, కులం, జెండర్, డిసెబులిటీ వంటి వివరాలు తప్పుగా ఉన్నట్టయితే పరీక్షా హాలులో ‘ నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీ ఫారం ద్వారా సవరించుకోవచ్చని TSTET అధికారులు తెలిపారు. ఒక వేళ హాల్ టికెట్‌పై ఫొటో లేదా సంతకం ఏదీ లేకపోతే వారిని పరీక్షా హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఏదైనా టెక్నికల్ సమస్య వల్ల ఫొటో, సంతకం రాని వారు లెటెస్ట్ ఫొటోను అతికించి ఆధార్‌కార్డు జతచేసి గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించుకుని సంబంధిత పత్రాలు జిల్లా విద్యాధికారికి అందించాల్సి ఉంటుంది. డీఈవో వాటిని పరిశీలించి నిర్ధారిస్తే వారిని మాత్రమే పరీక్షకు అనుమతిస్తామని తెలిపారు. ఫొటో సంతకం, లేని అభ్యర్థులు పరీక్షకు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నందున వెంటనే డీఈవోను సంప్రదించాలని సూచించారు.
Sir నాకు ఒక డౌట్ …అందుకే రెకరెక్షన్ కాలజ్ నమే కూడా చేసుకోవచ్చా …
కాలేజ్ name తప్పు పెట్టిన అక్కడ కాలేజ్ name change చేసుకోవచ్చా