HomeLATESTటీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఆ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన.. ఆ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్ష హాల్‌టికెట్లను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.tspsc.gov.in/) హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ నియామక పరీక్షలను నిర్వహించనున్నారు. గతేడాది డిసెంబర్ 31న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 78 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 8న ఈ పోస్టుల భర్తీకి రాతపరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!