తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్లో 29 జూలై 2022 నుండి 26 ఆగస్టు 2022 వరకు దరఖాస్తులకు సమయం ఇవ్వగా.. 16,381 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెస్స్ ను www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచింది టీఎస్పీఎస్సీ. 7 నవంబర్ 2022న టీఎస్పీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షను కమిషన్ నిర్వహించబోతోంది. హాల్ టికెట్ ముందుగానే డౌన్లోడ్ చేసుకొని, ఎగ్జామ్ సెంటర్కు రెండు గంటలు ముందే చేరుకుంటే మంచిదని అధికారులు సూచించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. హాల్ టికెట్ మీద ఫోటో లేకుంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో పాస్ఫొటో తీసుకెళ్లాలి. ఆధార్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి ఒరిజినల్ ఐడీ ఏదోఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మెరిట్ క్రమంలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఈ పరీక్ష రాత పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు.
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1-జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్-150 మార్కులు- ఉంటుంది. సమయం-150 నిమిషాలు కేటాయించారు. దీన్ని నవంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. పేపర్ 2 -డిప్లొమా స్థాయి సబ్జెక్ట్-150 మార్కులకు ఉండగా-150 నిమిషాల సమయం ఉంటుంది. ఇది మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ – LINK