Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆ పరీక్షల తేదీలను ప్రకటించిన TSPSC.. ఈ రోజు నుంచే హాల్ టికెట్లు

ఆ పరీక్షల తేదీలను ప్రకటించిన TSPSC.. ఈ రోజు నుంచే హాల్ టికెట్లు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను ఈ నెల 08, 09 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆయా తేదీల్లో రెండు షిఫ్ట్ లలో ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు విడుదల చేసినట్లు తెలిపింది.

Advertisement

పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సారి CBPT విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే https://www.digialm.com/OnlineAssessment/index.html?1222@@M2 లింక్ ద్వారా మాక్ టెస్ట్ రాయవచ్చు. గతంలో పేపర్ లీక్ కారణంగా ఈ పరీక్షలను రద్దు చేయగా.. మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!