తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కొత్త ప్రభుత్వం ఏర్పడంతో పాటు పాత కమిషన్ స్థానంలో కొత్త టీఎస్‌పీఎస్సీ బోర్డు ఏర్పాటు అయింది. సుప్రీంకోర్టులో వేసిన గ్రూప్ 1 పిటిషన్ ఉపసంహరించుకోవడంతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్దు సిద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి, వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే 60 కొత్త పోస్టులను కలిపి మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు సప్లిమెంటరీ లేదా కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
కొత్తగా 60 పోస్టులు
గతేడాది 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపితే మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకూ ఉండే అవకాశం ఉంది. అదనపు పోస్టులకు సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్పీ యోచిస్తోంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్-2కు ఇలాగే చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు.