గ్రూప్ వన్.. రాష్ట్రంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ ఇదే. ఈ పరీక్షకు ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. సెలెక్షన్ ప్రాసెస్ మూడు దశల్లో జరుగుతుంది. ఈ జాబ్ కొట్టాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది.
గ్రూప్ 1లో ఏమేం పోస్టులుంటాయి
రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి గెజిటెడ్ పోస్టులు గ్రూప్–I సర్వీసులు. దీని ద్వారా డిప్యూటీ కలెక్టర్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్స్, డిస్ర్టిక్ట్ రిజిస్ర్టార్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎంప్లాయ్‍మెంట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్, డిప్యూటీ రిజిస్ర్టార్, పంచాయత్ రాజ్ ఆఫీసర్స్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, బీసీ వెల్పేర్ ఆఫీసర్స్, మునిసిపల్ కమీషనర్స్ గ్రేడ్–II, మండల పరిషత్ డెవలప్‍మెంట్ ఆఫీసర్స్, లే సెక్రెటరీ/అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్‍ఆడిట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది.. ఎన్ని మార్కులు
ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్‍లో 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హులైన వారికి ఆరు పేపర్లతో డిస్రిప్టివ్ (రాతపూర్వక) వ్యాసరూప ప్రశ్నల పద్ధతిలో మెయిన్స్ నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లిష్ పరీక్షను క్వాలిఫైయింగ్ పేపర్‍గా నిర్దేశించారు. మెయిన్స్‌లో అర్హులైన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్
పేపర్ | సబ్జెక్టు | మార్కులు | సమయం (గం) |
జనరల్ ఇంగ్లిష్ | 150 | 2.30 | |
పేపర్–1 | జనరల్ ఎస్సే | 150 | 2.30 |
పేపర్–2 | హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ | 150 | 2.30 |
పేపర్–3 | ఇండియన్ సొసైటీ, కాన్‍స్టిట్యూషన్ & గవర్నెన్స్ | 150 | 2.30 |
పేపర్–4 | ఎకానమీ అండ్ డెవలప్‍మెంట్ | 150 | 2.30 |
పేపర్–5 | సైన్స్ & టెక్నాలజీ | 150 | 2.30 |
పేపర్–6 | తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ | 150 | 2.30 |
ఇంటర్వ్యూ 100
మొత్తం 1000