HomeLATESTఇండియన్​ నేవీలో 2500 సెయిలర్​ జాబ్స్​

ఇండియన్​ నేవీలో 2500 సెయిలర్​ జాబ్స్​

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకుగాను 2500 సెయిలర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టుల్లో చేరొచ్చు.

మొత్తం ఖాళీలు: 2500, పోస్టులు: ఏఏ (ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌) –- 500, ఎస్ఎస్ఆర్ (సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌) – 2000

అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 2002 ఆగ‌స్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉన్న అభ్యర్థులు అర్హులు.ః

సాలరీ: ట్రెయినింగ్‌ పీరియడ్‌లో స్టైపెండ్‌ కింద నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్‌ 3 (డిఫెన్స్‌ పే) కింద నెలకు రూ.21,700 – రూ.69,100, అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 29 నుంచి ఏప్రిల్​ 5వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

వెబ్​సైట్​: www.joinindiannavy.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!