HomeLATESTగ్రూప్​ 4 కీ పై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్​ 4 కీ పై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్​ 4 ప్రిలిమినరీ కీ (TSPSC GROUP 4 PRELIMINARY KEY) వచ్చే వారంలో విడుదల కానుంది. టీఎస్​పీఎస్​సీ అందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. జులై 1వ తేదీన టీఎస్​పీఎస్​సీ గ్రూప్-4 పరీక్ష జరిగింది. పరీక్ష ముగిసి దాదాపు నెలన్నర రోజులు కావస్తుండటంతో లక్షలాది మంది గ్రూప్​ 4 ఫలితాలు ఎప్పుడొస్తాయా.. అని ఎదురుచూస్తున్నారు. గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష తరహాలోనే పరీక్ష జరిగిన తర్వాత 15 రోజులకు టీఎస్​పీఎస్​సీ ప్రైమరీ కీ విడుదల చేస్తుందని అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ.. గ్రూప్​ 4 పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్​ 1, పేపర్​ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్​ షీట్ల స్కానింగ్​ ప్రక్రియ ఆలస్యమైందని టీఎస్​పీఎస్​సీ అధికారులు చెబుతున్నారు.

Advertisement

మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు 7.61 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరందరూ ప్రైమరీ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ వారంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్​ పూర్తి కానుండటంతో వచ్చే వారంలో ప్రైమరీ కీ విడుదల చేసేందుకు టీఎస్​పీఎస్​సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైమరీ కీ పై అభ్యంతరాల స్వీకరణకు అభ్యర్థులకు కొంత గడువు ఇవ్వనుంది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్​ కీ రిలీజ్​ చేస్తుంది. ఫైనల్​ కీతో పాటే ఫలితాలను విడుదల చేయనుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!