Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSమొదలైన గ్రూప్-4 అప్లికేషన్లు.. 1120 పోస్టులు తగ్గాయి

మొదలైన గ్రూప్-4 అప్లికేషన్లు.. 1120 పోస్టులు తగ్గాయి

తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైంది. టీఎస్పీఎస్సీ (TSPSC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం 30వ తేదీ ఉదయం మొదలు కావాల్సిన అప్లికేషన్ల నమోదు సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని టీఎస్​పీఎస్​సీ వెల్లడించింది. వీటితో పాటు కొన్ని పోస్టులకు అమోదం రాకపోవటంతో.. వాటిని ఈ నోటిఫికేషన్​ నుంచి తొలిగించింది. ఎట్టకేలకు రాత్రి 11.45 నిమిషాలకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో (https://www.tspsc.gov.in/) అప్లికేషన్ల ప్రాసెస్​ మొదలైంది.

Advertisement

గ్రూప్​ 4 డిటైయిల్డ్ నోటిఫికేషన్​లో 1120 పోస్టులను టీఎస్​పీఎస్​సీ తగ్గించింది. డిసెంబర్ 1వ తేదీన 9,168 పోస్టులతో గ్రూప్ 4 వెబ్ నోట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అప్పుడున్న పోస్టులకు బదులుగా 8039 పోస్టులతో ఇప్పుడు తుది నోటిఫిషన్​ జారీ చేసింది. పంచాయతీ రాజ్​ విభాగంలో 1245 పోస్టులుంటే.. కొన్నింటికే అనుమతి లభించిందని.. అనుమతి రానివి తొలిగించినట్లుగా టీఎస్​పీఎస్​సీ వర్గాలు తెలిపాయి. శాఖలవారీగా పోస్టుల వివరాలను తుది నోటిఫికేషన్​లో పొందుపరిచింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!