దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తోన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను మరో పది రోజుల్లో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఫలితాలకు విడుదలకు చిక్కుముడిలా మారిన కోర్టు కేసు సమస్య పరిష్కారం కావడంతో కమిషన్ రిజల్ట్స్ విడుదలపై ఫోకస్ చేసింది. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు 33.33 శాతానికి పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఆదేశాల కోసం ఇన్ని రోజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదురు చూసింది. గురువారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. గ్రూప్ -1 నియామకాలకు సంబంధించి రాజేశ్‌కుమార్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను పాటించాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను (TSPSC Group-1 Prelims Results) విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ అధికారులు శుక్రవారం సమావేశమై గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పదిరోజుల్లో ప్రిలిమ్స్ కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మందిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు మొత్తం 2,86,051 మంది హాజరయ్యారు. ఇందులో బబ్లింగ్, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పెట్టింది. ఇంకా.. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల ఇమేజింగ్‌ను ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది.
Read This: సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్
ఏప్రిల్ లో మెయిన్స్ ఎగ్జామ్..
ముందుగా ప్రకటించిన ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ ను 2023 జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉంది. అయితే.. కోర్టు కేసుల కారణంగా ప్రిలిమినరీ ఫలితాల విడుదల ఆలస్యమైంది. దీంతో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇతర నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉండడంతో ఏప్రిల్ లోనే గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ఇందుకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Group2 notification Inka Eppudu vasthundo 3 months aipoindhi finance clearance vachi.