హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, సీఎస్‌ఈ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ సంయుక్తంగా సివిల్స్-2023 ఫ్రీ కోచింగ్ నిర్వహిస్తోంది. సివిల్స్ పరీక్షకు ప్రిపేరవుతున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఈ కోచింగ్ అందించాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
అర్హత: డిగ్రీ పాసైన వారందరూ అర్హులే. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
దరఖాస్తులు: జనవరి 10వ తేదీ లోపు యూనివర్సిటీ ఆఫీసులకు అందేలా అప్లికేషన్లను పంపించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను సీఎస్‌ఈ- రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ కార్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి. జనవరి 22న ఎంట్రన్స్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుంది.
పూర్తి వివరాలకు www.manuu.edu.in వెబ్సైట్ సంప్రదించాలి.