టీఎస్పీఎస్సీ గ్రూప్-1 (TSPSC Group1) రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్ మొదటి మెట్టు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ అర్హత సాధించేందుకు ఇది వడ పోత పరీక్ష లాంటిది. అందుకే ఇక్కడ గట్టెక్కితేనే… గ్రూప్ 1 మెయిన్స్ రాసేందుకు అర్హులవుతారు. అంతకు మించి ఇందులో వచ్చిన మార్కులు.. మీ తదుపరి మెరిట్‌కు.. సెలెక్షన్ ప్రాసెస్‌కు.. పరిగణనలో తీసుకోరు.
ప్రిలిమ్స్ లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. జనరల్ స్టడీస్.. కరెంట్ ఈవెంట్స్, జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర, ప్రపంచ, భారత భూగోళ శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సమాజం, కళలు సంస్కృతి, వారసత్వం, సాహిత్యం , మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
మొత్తం 150 మార్కుల్లో ఎన్ని మార్కులు సాధిస్తే మెయిన్స్ రాసేందుకు ఛాన్స్ దొరుకుతుంది.. ఈసారి కటాఫ్ ఎంత ఉంటుంది..అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి గ్రూప్ 1 రిక్రూట్మెంట్కు టీఎస్పీఎస్సీ ఎంచుకున్న సెలెక్షన్ ప్రొసీజర్ ప్రకారం.. ఈ సారి పోస్టుకో తీరుగా ప్రిలిమ్స్ గట్టెక్కే మార్కుల కటాఫ్ మారిపోయే అవకాశముంది.
టీఎస్పీసీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈసారి పోస్టుల సంఖ్యను బట్టి.. 1:50 రేషియో ప్రకారం అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేస్తారు. అంటే ఉదాహరణకు పది లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాస్తే… ఇప్పుడున్న 503 పోస్టుల ప్రకారం (1:50 నిష్పత్తి ప్రకారం) కేవలం 25150 మందిని మెయిన్స్‌కు అర్హులుగా ఎంపిక చేస్తారు. అంటే బ్రాడ్‌గా చూస్తే.. ప్రిలిమ్స్ పరీక్షలో టాప్ 25,150 ర్యాంకుల లోపు ఉన్న అభ్యర్థులే మెయిన్స్ రాసేందుకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ.. అప్పుడు కూడా గ్యారంటీ లేదనే చెప్పుకోవాలి. మల్టీ జోన్లు, రిజర్వేషన్లను బట్టి ఒక్కో పోస్టుకు 50 మందిని అర్హులుగా పరిగణిస్తారని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే ఆయా కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి.. మీరు మెయిన్స్‌కు చేరుకుంటారా.. లేదా.. అనేది ఆధారపడి ఉంటుంది. అదెలాగో చూద్దాం
మల్టీ జోన్ వారీగా ఉన్న పోస్టులు, రిజర్వేషన్, ఈడబ్ల్యుఎస్, స్పోర్ట్ కోటా ను పరిగణనలోకి తీసుకుని ప్రిలిమ్స్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. అంటే.. జోన్ల వారీగా కూడా ఈ మార్పులు ఉంటాయి. మల్టీ జోన్ 1 లో 234 పోస్టులున్నాయి. అంటే మల్టీ జోన్ 1 లో మెయిన్స్‌కు ఎంపిక కావాలంటే కంపల్సరీగా మీరు.. ఈ మల్టీ జోన్లో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల్లో నుంచి టాప్ 11700 ర్యాంకుల్లో ఉండాల్సిందే. అప్పుడు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కీలకమవుతుంది.
ఉదాహరణకు.. ఈసారి మొత్తం 503 పోస్టుల్లో మల్టీ జోన్ వన్‌లో ఒకటే స్పోర్ట్ కోటా పోస్టు (ఎంపీడీవో) ఉంది. అంటే ఈ మల్టీ జోన్లో ఈ పోస్టుకు అప్లై చేసుకున్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల్లో నుంచి (ప్రిలిమ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారిని) 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
ఉదాహరణకు మల్టీ జోన్ 2 లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి బీసీ (డీ)లో విమెన్ కోటా ఒక్క పోస్టు మాత్రమే ఉంది. ఈ మల్టీ జోన్లో ఈ పోస్టులకు అప్లై చేసిన విమెన్ నుంచి ప్రిలిమ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన 50 మంది టాపర్లకు మెయిన్స్ రాసే అవకాశం దక్కుతుంది.
ఇదే తీరుగా మల్టీ జోన్లు, రిజర్వేషన్ల వారీగా ప్రకటించిన పోస్టులను బట్టి.. ఒక్కో పోస్టుకు మెయిన్స్‌లో తప్పనిసరిగా 50 మంది అభ్యర్థులు పోటీ పడేలా ఇక్కడ వడపోత జరుగుతుంది.
ఓపెన్ కోటా కేటగిరీలో మాత్రం భారీగా పోటీ ఉండే అవకాశముంది. మొత్తం 503 పోస్టులో 129 ఓపెన్ జనరల్ కోటా పోస్టులున్నాయి. రిజర్వేషన్లకు అతీతంగా వీటికి ఎవరైనా పోటీ పడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా మార్కులు సాధించేందుకు పోటీ పడాలి. టాప్‌లో 6450 మంది ర్యాంకుల్లో ఉంటే మెయిన్స్ కు ఎంపికైనట్లే. అంటే ఇప్పుడున్న పోటీ అంచనా ప్రకారం మొత్తం 150 మార్కుల్లో 120కి మించి మార్కులు సాధించాల్సి ఉంటుంది.
Question
TS TET Exam Pass marks ST