HomeLATESTటెట్ కు దరఖాస్తుల వెల్లువ.. ఇప్పటివరకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

టెట్ కు దరఖాస్తుల వెల్లువ.. ఇప్పటివరకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 1.45 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

ఇప్పటి వరకు మొత్తం 1,45,622 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో పేపర్-1 కు సంబంధించి 46,896 మంది, పేపర్-2 పరీక్షకు 6,900 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2 పేపర్లకు గాను 91,826 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని తెలిపారు. అయితే.. చివరి తేదీ నాటికి మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.5 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.అభ్యర్థులు ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టెట్ అధికారిక వెబ్ సైట్: https://tstet.cgg.gov.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!