HomeLATESTగురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలివే!

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించడం.. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడంతో అడ్మిషన్లకు భారీ పోటీ నెలకొంది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు 23-04-2023న ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంట వరకు అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలని సూచించారు. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు.. http://tswreis.ac.in/ (లేదా) http://tgtwgurukulam.telangana.gov.in (లేదా) http://mjptbcwreis http://tgcet.cgg.gov.inలను సందర్శించండి.

Advertisement

అభ్యర్థులకు ముఖ్య సూచనలు:

  • అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్ నంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
  • వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయి.
  • విద్యార్థుల ఎంపికకు “పాత జిల్లా” ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది. ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678 ని లేదా ప్రాస్పెక్టస్లోలో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు (ఉ.10.30 గంటల నుండి సా. 5:00 గంటల వరకు)
  • 2022-2023 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (విద్వార్థినీ విద్యార్థులు ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ను చేయవలసి ఉంటుంది)
    పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 06-03-2023
    పరీక్ష నిర్వహణ తేదీ: 23-04-2023

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!