డీఎస్సీ, గురుకుల టీచర్ల నియామక పోటీ పరీక్షలతో పాటు గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత శిక్షణ అంధిస్తోంది. బీసీ స్టడీ సర్కిళ్లలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫ్రీ కోచింగ్ అందించనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గ్రూప్–3, గ్రూప్–4 కోచింగ్ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులు, గురుకుల, డీఎస్సీ కోచింగ్ కోసం బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన వారు ఫ్రీ కోచింగ్ తీసుకునేందుకు అర్హులు. దీంతో పాటు అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ. 5లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆయా స్టడీ సర్కిళ్ల పరిధిలో ఉన్న సీట్లు అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో ఆగస్ట్ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 27న, విడుదల చేస్తారు. కోచింగ్ క్లాసులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్రీ మెటీరియల్ కూడా అందిస్తారు. మరిన్ని వివరాలకు 040–24071178 లేదా 040–27077929 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
వెబ్సైట్ https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do
I prepaid for Gurukula teachers
Si